శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్‌‌టిసి ద్వారానే ఎలక్ట్రికల్‌ బస్సుల నిర్వహణ

1 గంట క్రితం

apsrtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్త్రీ, శక్తి పథకం అమలు తర్వాత ఆర్‌‌టిసి బస్సుల్లో పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని, కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రికల్‌ బస్సులను ఆర్‌‌టిసి ద్వారానే నిర్వహించాలని ఆర్‌టిసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఇయు) రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జివి నరసయ్య కోరారు. ఈ మేరకు శనివారం సిఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఆర్‌‌టిసిలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయడంతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఆర్‌ ‌టిసి ఉద్యోగులకు రావాల్సిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ను పదవీ విరమణ చేసిన రోజే ఆర్‌‌టిసి ద్వారా చెల్లించే విధానం అమలు చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వం ఆర్‌‌టిసి ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.120 కోట్ల నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్‌‌టిసి పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రభుత్వంలోని ఇతర అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మాదిరిగా ఆప్‌కాస్‌ ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్