కొత్త పెన్షన్ల కొరకు దరఖాస్తుదారుల ఇబ్బందులు
ప్రజాశక్తి - వేపాడ : పూర్తిస్థాయిలో డిజిటల్ అసిస్టెంట్లు లేకపోవడం, సర్వర్లు పనిచేయకపోవడం, విద్యుత్ కోతలతో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేపాడ మండలంలో 18 గ్రామ సచివాలయాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొత్త పెన్షన్ల మంజూరు కొరకు ఈ నెల 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు సచివాలయాలలో ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన ఇచ్చింది. దీంతో అర్హులైన వారంతా సచివాలయాలలో ఉదయం నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వేచి చూస్తున్నారు. సర్వర్లు పనిచేయకపోవడం, విద్యుత్ కోతలు, సిబ్బంది లేకపోవడంతో పడిగాపుపలు పడుతున్నారు. సర్వర్ సక్రమంగా పనిచేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ... కొత్త పెన్షన్ లు మంజూరు చేసిన దాఖలాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)