బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులను 100 శాతం గెలిపిస్తాం: మైలవరం ఎమ్మెల్యే

1 గంట క్రితం

ntr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- మైలవరం : తమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులను 100 శాతం విజయంతో గెలిపిస్తామని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్లు, కూటమి అభ్యర్థుల విజయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్లు ప్రక్రియకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఎలాంటి రిజర్వేషన్లు వచ్చినా, 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ కలిసి పనిచేసిన విధంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా, కూటమి తరఫున ఎవరైనా పోటీ చేసినా 100 శాతం విజయమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేసినా, సహకరించకపోయినా కఠిన చర్యలు తప్పవని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని శాశ్వతంగా పార్టీ నుంచి తొలగిస్తామని చంద్రబాబు గారు హెచ్చరించారని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో గ్రామ పార్టీ నాయకత్వానికి ప్రాధాన్యత ఉంటుందని, గ్రామ నాయకులు సూచించిన అభ్యర్థుల వివరాలను పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పారు. అనంతరం ఐవీఆర్ కాల్స్ వంటి ప్రక్రియల ద్వారా అభిప్రాయాలు సేకరించి పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. మైలవరం నియోజకవర్గంలో మున్సిపాలిటీ నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల వరకు కూటమి సమన్వయంతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఏ గ్రామం, ఏ మండలం ఏ మిత్రపక్షానికి రిజర్వేషన్ లేదా అవకాశం కేటాయించినా, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కూటమి అభ్యర్థులను 100 శాతం గెలిపించుకునేలా పనిచేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్