బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ శిక్షణ ముగింపు సభ

59 నిమిషాల క్రితం

konaseema
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -రామచంద్రపురం : రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 51వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు శిక్షణా శిబిరం ముగింపు సభ బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సుభాష్‌ తండ్రి వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో రామచంద్రపురం ప్రాంతంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి మాట్లాడుతూ.. రామచంద్రపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికలతో పాటు బాలుర జట్లకు కూడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలుర జట్టు శిక్షణ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు విజయవాడలోని వివిధ క్రీడా వేదికల్లో నిర్వహించే జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ బాలికల, బాలుర జట్లు పాల్గొంటాయని వెల్లడించారు. బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ జాతీయ స్థాయి పోటీలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్. రాజు, ఎంపిక కమిటీ కార్యదర్శి అప్పలరాజు, గంగాధర్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సలాది నాయుడు మాస్టారు, డాక్టర్ చెలికాని రామారావు, డాక్టర్ కోట సతీష్ కుమార్, కట్టా నాగేశ్వరరావు, కంచుమర్తి బాబురావు, అప్పాజీ, పడాల బాబి, గొల్లపల్లి కృష్ణ, ఏసుదాసు, మురళి,దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్