హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లోనూ బాలికలు ఆధిక్యతను సాధించారు. మొత్తం 31,736 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. వారిలో 27,857 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో రికార్డు స్థాయిలో 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 82.61 శాతంగా నమోదైంది.
తెలంగాణ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)