ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో వినాయక విగ్రహ ఊరేగింపులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ విగ్రహాన్ని ఊరేగింపుతో తరలిస్తున్న సమయంలో కింద పడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి దక్షిణ ముంబయిలోని భులేశ్వర్‌కు 22 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని రాత్రి 10గంటల సమయంలో విగ్రహాన్ని తరలిస్తుండగా..బలరామ్ మర్చంట్ రోడ్డుపై వాహనం కుదుపులకు గురైంది. దీంతో విగ్రహం కిందపడటంతో దాని కింద నలిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులను సంకేత్ నెవ్‌షే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30)గా గుర్తించారు.
వినాయక విగ్రహం పడి ఇద్దరు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)