తెలంగాణ : సిఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ తీసేయాలని, జిఒ 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ .... కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరకేంగా శాంతియుతంగా విభిన్న రూపాల్లో ఆందోళనలు చేపడుతూ తమ పరిణితిని చాటుతున్నారు. తాజాగా విద్యార్థులు తీసుకున్న నిర్ణయం పలువురి అభిమానాన్ని చూరగొంది. సూర్యాపేట చౌరస్తాలో శాంతియుతంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరనస తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోయారు. గమనించిన తోటి విద్యార్థినులు ఒక్కసారిగా వలయంగా ఏర్పడి మేమున్నామంటూ పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మద్య తోపులాట జరిగింది. విద్యార్థుల ఐకమత్యం ముందు పోలీసులు వెనుదిరాగాల్సి వచ్చింది.
విద్యార్థుల ఐకమత్యం - వెనుదిరిగిన పోలీసులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)