ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సంచలన ఘటన - మహిళను ముక్కలు చేసి బిర్యానీ వండారు ..!

1 గంట క్రితం

Shocking incident – ​​Woman chopped into pieces and cooked into biryani..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : దేశంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. మహిళను ముక్కలు చేసిన ఓ జంట బిర్యాని వండింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... ఈ నెల 5న చెన్నై నుండి ఢిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు యూపీలోని ఆగ్రా రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ ఓ జనరల్ కంపార్ట్ మెంట్ లోని ఎరుపు రంగు బ్యాగ్ నుండి దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బ్యాగును పరిశీలించగా అందులో మానవ శరీర భాగాలు ఉన్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరగా సూట్ కేస్ చెన్నై నుండి వచ్చినట్టు తేలింది. దీంతో యూపీ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.


తమిళనాడు పోలీసులు చెన్నై సెంట్రల్ రైల్వే‌స్టేషన్, ఇతర ప్రాంతాల్లో దాదాపు 350 సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఓ పురుషుడు, మహిళ తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలుతో సూట్ కేస్ పెట్టి తరవాత సబర్బన్ రైలు ఎక్కి గూడువాంజేరి చేరుకున్నట్టు గుర్తించారు. అనంతరం వారిని ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతడి భార్య భాగమి మాజిక్ గా గుర్తించారు. వారితో పాటు హయాత్ నిషా అనే మహిళ ఉంటున్నట్టు విచారణలో తేలింది. పోలీసులు మాణిక్ ఇంటికి వెళ్లి పరిశీలించగా తలుపులు మూసి ఉన్నాయి. దీంతో వారు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూసి షాక్ అయ్యారు. గది అంతా రక్తపు మరకలు కనిపించడంతో పాటు వంటగదిలో కుక్కర్ లో రైస్ తో పాటు మానవశరీర ముక్కలు కనిపించాయి. రైస్ కుక్కర్ చుట్టూ మైదాపిండి చుట్టి కనిపించింది. రైస్ కుక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని చెంగల్ పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు విచారణలో మాణిక్ అతడి భార్య కలిసి వారితో ఉంటున్న హయాత్ నిషాను హత్య చేసి బిర్యానీ వండినట్టు తేలింది. ఘటనా స్థలంలో, రైలులో దొరికిన బ్యాగులో తల కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఒడిశాకు చెందిన హయాత్ నిషా భర్తతో విడిపోగా ఆమె మాణిక్ అతడి భార్యతో కలిసి ఉంటోంది. మాణిక్ త‌న‌కు త‌మ్ముడు అవుతాడ‌ని, అత‌డి భార్య మ‌ర‌ద‌లు అవుతుంది నిషా కొంద‌రికి చెప్పిన‌ట్టు పోలీసులు విచార‌ణ‌లో గుర్తించారు. ఈ దారుణ ఘ‌ట‌న అటు త‌మిళ‌నాడులో, ఇటు ఒడిశాలో సంచ‌ల‌నంగా మారింది. విచార‌ణ పూర్తైతే అస‌లు నిజాలు బ‌య‌ట‌పడే అవ‌కాశం ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్