ప్రజాశక్తి-కొల్లిపర : రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరు శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం దావులూరు పాలెం గ్రామానికి చెందిన అద్దంకి రాజారావు, ఏమినేని రాఘవమ్మ సొంత పనుల నిమిత్తం టీవీఎస్ మోపెడ్ పై తూములూరు గ్రామానికి వస్తుండగా వెనక నుండి ఇసుక ట్రాక్టర్ బలంగా ఢీకొనటంతో ఘటన స్థలంలోని ఇరువురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. దర్యాప్తు చేసి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026, 12:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)