* గోడ పత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి..విజయనగరం టౌన్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా డిసెంబర్ 1, 2, 3 తేదీలలో ఢిల్లీలోని రామ్జీలా మైదానంలో నిర్వహించనున్న 'చలో ఢిల్లీ' కార్యక్రమంలో విజయనగరం జిల్లా నుండి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటిస్ తరలి రావాలని ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలో డిల్లీ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యు ఎస్ రవికుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సూర్యభగవాన్, డి ఎల్ ఎన్ మూర్తి మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ సంపూర్ణ మద్దతు మరియు సహకారం అందించాలని కోరుచున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రక్షణగా ఉన్న పాత కార్మిక చట్టాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త లేబర్ కోడ్స్ అమలు ఈ చేస్తోందన్నారు. ఈ విధానాల వల్ల కార్మికులు ఉద్యోగ భద్రత, ప్రావిడెంట్ ఫండ్ , గ్రాట్యటీ, నష్టపరిహారం వంటి ఎన్నో చట్టబద్దమైన హక్కులను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం 'ఫెక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్' విధానాన్ని తీసుకువచ్చి కార్మికుల జీవితాలను అభద్రతలోకి నెట్టిందని మండిపడ్డారు.
ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔషధ రంగంలో పనిచేస్తున్న మెడికుల్ రిప్రజెంటేటివ్స్కు కనీస వేతనాలు, పని గంటల నియంత్రణ మరియు సేల్స్ ప్రమోష ఎంప్లాయిస్ యాక్ట్ రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.. ఈ ఆందోళన ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కార్మిక వ్యతిరేక కోడ్స్మ వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర యూనియన్ జాతీయ యూనియన్ మరియు సి ఐ టి యు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి నిరసన కార్యక్రుముంలో పాల్గొనడానికి జిల్లా నుండి ప్రతినిధులు తరలి రావాలని కోరారు.. కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలందరూ సంపూర్ణ మద్దతు మరియు సహకారం అందించాలని కోరారు. గోడ పత్రిక ఆవిష్కరణ లో యూనియన్ నాయకులు బి.రామారావు, పి.శ్రీను, ఎం పి శేషగిరి, ఆర్. రామకృష్ణ మరియు వర్కింగ్ కమిటీ మెంబర్స్ పాల్లొన్నారు.







కామెంట్లు (0)