యాప్ రావటం లేదని చేతు లెత్తేసిన ము న్సిపల్ జనన-మరణ శాఖాధికారులు..
మీ సేవలో సేవ లందక లబోదిబో మంటున్న వందలాది మంది ప్రజలు, విద్యార్థులు..
సంక్షేమ ఇతర ప్రభుత్వ పథకాలకు దురమౌతా మంతున్న లబ్ధిదారులు..
ప్రజాశక్తి - చిలకలూరిపేట : మీ సేవలో 2016వ సంవత్సరానికి ముందు జనన మరణ ధ్రువీకరణ పత్రాలు ఆన్లై న్ నమోదు కావటం లేదని అధికారులు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సి.ఆర్.ఎస్.) పని చేయటం లేదని, దీంతో ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని అధికారులు వెల్లడించారు. 2016 వ సంవత్సరం తరువాతవి అయితే ఇస్తున్నామంటున్నారని గ్రామస్తులు, విద్యార్థులు, ప్రభుత్వ పధకాలకు, రిజిస్ట్రేషన్లకు అవసమైన వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలకు కానీ ..బ్యాంకులు, పింఛన్, మరే అవసరాలకు అయినా ఎప్పుడు ఏ ధ్రువీకరణ పత్రాలు అడుగుతారో తెలియని పరిస్థితుల్లో పట్టణ, మండల ప్రజలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2016వ సంవత్సరం లోపు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మీ సేవలో నమోదు చేసుకోకపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపో తున్నారు. ప్రభుత్వ పథకాలకు సమయ ముండదు. ఆ సమ యానికి అధికారు లుండరు. దీంతో సరైన సమయంలో అర్జీలు పెట్టుకొక పోతే లబ్ది కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 2016వ సంవత్స రానికి ముందు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాల్సి వస్తే తెలియ కుండానే నక్షత్రాలు కనిపిస్తున్నాయని, ఆన్లైన్లో దానికి సంబంధించిన యాప్ ఓపెన్ కావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. .ఈ విషయమై జనన, మరణ ధ్రువీకరణాదికారి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సి ఆర్ ఎస్) పని చేయటం లేదని, ప్రభుత్వం ఆ యాప్ ని ఎప్పుడు విడుదల చేస్తే ఆ వెంటనే ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, ఇతర సంక్షేమ పథకాలకు దురమౌతామని, ఇతర బ్యాంక్, పాస్పోర్ట్ తదితర వాటికి అవసరం అయినందున ప్రభుత్వం వెంటనే స్పందించి యాడ్ ను త్వరిత గతిన సరి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)