మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కనీస వసతులు లేని గ్రామాలు

11 గంటల క్రితం

social
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:51 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- శంఖారావంలో నాయకుల ముందు ప్రజల గోడు

ప్రజాశక్తి - యంత్రాంగం : ప్రజా సంఘాల ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో శంఖారావం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు నాయకుల దృష్టికి వారి సమస్యలు తీసుకొస్తున్నారు. సోమవారం పలుచోట్ల దళితులు, గిరిజనులు తమకు కనీస సౌకర్యాలు కూడా లేవని విద్యుత్, తాగునీరు, స్మశాన వాటికలు లేక అవస్థలు పడుతున్నామని తమ గోడును నాయకుల ముందు వెళ్లబోసు కున్నారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిన్న కంబలూరులో మాల, మాదిగ పేటలోని దళిత యువకులు, మహిళలు పలు సమస్యలను నాయకు ల దృష్టికి తీసుకొచ్చారు. దళితులు మృతి చెందితే అంత్యక్రియలకు ఆరడుగుల స్థలం కూడా కరువైంద న్నారు. పొలాలకు వెళ్లే రస్తాకిరువైపులా గట్ల వెంట పూడ్చుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వ భూములను అగ్రవర్ణాలే ఆక్రమిస్తున్నా ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలో దళితుల స్మశాన వాటిక కోసం జీవో 1235 ప్రకారం 2 ఎకరాల భూమిని కేటాయించి, బోర్ వేయించాలని కమిషన్ సూచించినా నేటికీ చాలా గ్రామాల్లో కేటాయించడం లేదన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం, ఎమ్మిగనూరు మండలాల్లో దళితుల సమస్యలను ప్రజాసంఘాల నాయకులు అధ్యయనం చేశారు. విజయనగరం జిల్లా మెంటాడలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ గ్రామాల్లో పర్యటించారు. 25 ఏళ్లుగా గుర్లగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాక ఆయకట్టుదారులకు నేటికీ చుక్కనీరు అందలేదని దళితులు, గిరిజనులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ప్రాజెక్టు గట్టును కొండ చివర వరకు కలపకపోవడం వల్ల ఖాళీగా ఉన్న ప్రదేశం నుండి ప్రాజెక్టులోని నీరంతా వృథాగా పోతోందని, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే నిధులు కేటాయించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాల్లో దళితులకు స్మశాన వాటికలు లేక, దహన సంస్కారా లకు తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. దళితుల డి పట్టా భూములను ప్రభుత్వం ప్రీ హోల్డ్‌లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి రాయితీలు రావడం లేదన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు రాకోటి హరికృష్ణవేణి, ఐద్వా నాయకులు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని మరవకొత్తపల్లి, కొత్తచామలపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరంగి ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, తదితరులు దళితవాడల్లో పర్యటించారు. కొత్తచామలపల్లి దళిత స్మశాన వాటికను పరిశీలించారు. స్మశాన వాటికకు రహదారి, తాగు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడు గ్రామ దళితవాడలో బృందం పర్యటించింది. గ్రామంలో దళితులకు అరుంధ తీయ, మాల సామాజిక వర్గానికి ఉన్న స్మశాన వాటికకు దారిలేదని, స్మశాన స్థలం ఆక్రమణ గురైందని గ్రామస్తులు తెలిపారు. వెంకటా చలం ప్రాంతానికి స్వీపర్లుగా వెళ్తున్నామని, బస్సు సౌకర్యం కూడా లేదని వాపోయారు. స్మశాన వాటికకు దారి లేక అవస్థలు పడుతున్నామని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్