తాడేపల్లి : తిరుపతి జిల్లా రోడ్డు ప్రమాదంపై వైసిపి అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యస్విత మృతి చెందడం అత్యంత విషాదకరమని జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సోమవారం వైఎస్.జగన్ ఓ పోస్టు పెట్టారు. చిన్న వయసులోనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడినవారందరికీ అత్యవసరంగా మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుపతి రోడ్డు ప్రమాదంపై వైఎస్.జగన్ దిగ్భ్రాంతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 03:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)