బెర్న్ : పాకిస్థాన్, ఖతార్ ల మధ్యవర్తిత్వంతో ఇరాన్ తో ఉన్నత స్థాయి చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు జె.డి.వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నేతృత్వంలోని ఇరాన్ ప్రతినిధి బృందం ఈ సమాశంలో పాల్గొననుంది. యుద్ధాన్ని ముగించే మధ్యంతర ఒప్పందాన్ని అన్ని పక్షాలు పూర్తిగా అమలు చేసేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
లెబనాన్ ఇజ్రాయిల్ నిరంతర దాడుల కారణంగా హార్ముజ్ జలసంధిని మూసివేనట్లు ఇరాన్ ప్రకటించగా, ఆ మార్గం నుండి అన్ని నౌకలు ప్రయాణించవచ్చని అమెరికా సైన్యం పేర్కొంది.
హిజ్బుల్లా కాల్పుల విరమణ ప్రకటించినట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. శనివారం లెబనాన్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో 16 మంది మరణించారు. సెంట్రల్ గాజాపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో తమ ముబాషర్ కెమెరామెన్ అహ్మద్ విషా మరణించినట్లు అల్ జజీరా పేర్కొంది.









కామెంట్‌లు (0)