నాగ్ పూర్ : నీట్ -యుజీ రీ ఎగ్జామ్ కోసం ఒక అభ్యర్థికి యుఎఇలోని అబుదాబి సెంటర్ ను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ అభ్యర్థికి అబుదాబి నుండి పరీక్షా కేంద్రాన్ని నాగ్ పూర్ కు మార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై అభ్యర్థి తండ్రి ఆదివారం స్పందించారు. తన కుమారుడికి నాగ్ పూర్ లోని పిఎం శ్రీ కేంద్ర విద్యాలయ అజ్నిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు తెలిపారు. మొదట అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసినప్పుడు, అందులో అబుదాబిలోని ఒక పాఠశాల పరీక్షా కేంద్రంగా ఉండటం చూసి తాము షాక్ కు గురయ్యామని అన్నారు. తన కుమారుడు తీవ్ర మానసిక ఒత్తికి గురయ్యాడని అన్నారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేశామని, వారు ఈమెయిల్ పంపమని చెప్పారని అన్నారు. ఈమెయిల్ పంపిన తర్వాత, శనివారం సాయంత్రం 4.00గంటల లోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని ఫోన్ లో వెల్లడించారని అన్నారు. ప్రస్తుతం నాగ్ పూర్ కేంద్రాన్ని కేటాయించారని అన్నారు. ఈ అంశంపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల ఎన్ టి ఎ వ్యవహరిస్తున్న తీరుకు ఇది నిదర్శనమని మండిపడ్డారు.
NEET-UG re-exam : అబుదాబి నుండి నాగ్ పూర్ కు మారిన పరీక్షా కేంద్రం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 03:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)