న్యూఢిల్లీ : ఐసిసి మహిళల టి 20 ప్రపంచకప్–2026ను ఏడోసారి కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకున్న ఆసీస్‌కు ఐసిసి ఛైర్మన్ జై షా ట్రోఫీని అందజేశారు. అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా విజేత జట్టును అభినందిస్తూ ... మహిళల క్రికెట్ ప్రస్తుతం స్వర్ణయుగంలో కొనసాగుతోందని పేర్కొన్నారు.
"ఏడోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్న క్రికెట్ ఆస్ట్రేలియాకు అభినందనలు. ఫైనల్ వరకు అద్భుత పోరాటం చేసిన ఇంగ్లాండ్ జట్టుకూ శుభాకాంక్షలు. మహిళల క్రికెట్‌ను ఎందుకు తప్పక వీక్షించాలనేది ఈ ప్రపంచకప్ మరోసారి నిరూపించింది. టోర్నీ మొత్తం ఆటగాళ్ల పోరాట పటిమ, నైపుణ్యం, గెలవాలనే సంకల్పం అభిమానులను అలరించాయి. ఈ టోర్నీని విజయవంతం చేసిన అన్ని జట్లకు, ప్రతి మహిళా క్రికెటర్‌కు అభినందనలు. మహిళల క్రికెట్‌కు ఇది స్వర్ణయుగం" అని జై షా తన సందేశంలో పేర్కొన్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఆస్ట్రేలియా జట్టును అభినందించారు. "మరో ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు. టోర్నీ మొత్తం అజేయంగా నిలవడం వారి ఆధిపత్యానికి నిదర్శనం. విభిన్న పిచ్‌లు, పరిస్థితులకు వేగంగా అలవాటు పడుతూ నిలకడగా రాణించడం గొప్ప జట్ల లక్షణం. అలాంటి ఆటతీరుతోనే వరుస విజయాలు, ట్రోఫీలు సాధ్యమవుతాయి" అని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా విజేత జట్టును అభినందించింది. "2026 మహిళల టి 20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు అభినందనలు. Ellyse Perry, Grace Harris అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఫైనల్లో బౌలర్లు అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని కట్టడి చేయడంతో ఆసీస్ ఏడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది" అని ప్రశంసించింది.







కామెంట్‌లు (0)