mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపద్మశ్రీ అవార్డులు అందుకున్న నటులు రాజేంద్ర ప్రసాద్‌, మురళీ మోహన్‌

2 గంటల క్రితం

padma awards
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 12:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ అవార్డులు- 2026ను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష సేవలందించే వారికి ఇచ్చే పద్మ పురస్కారాల వేడుక మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరుగింది. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. గత నెలలో 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి అవార్డులను అందజేయగా.. మంగళవారం నాడు 47 మందికి అవార్డులు ప్రదానం చేశారు. సినీ రంగం నుంచి ప్రముఖ తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్‌, మురళీ మోహన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

New Delhi: President Droupadi Murmu confers the Padma Bhushan to veteran actor Mammootty during the second civil investiture ceremony, at Rashtrapati Bhavan, in New Delhi, Tuesday, June 23, 2026. (PTI Photo/Kamal Kishore)(PTI06_23_2026_000277B)Mammootty

మమ్ముట్టికి పద్మభూషణ్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నారు. అలాగే భారతదేశ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత్ రాజ్‌ను కూడా ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. వైద్యరంగంలో చేసిన విశేష సేవలకు గానూ ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. జెఎమ్‌ఎమ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ గిరిజన నాయకుడు శిబు సోరెన్‌కు ప్రజాసేవ విభాగంలో మరణానంతరం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించగా.. ఆయన తరఫున సతీమణి రూపి సోరెన్ ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణా నుండి ఏడుగురు పద్మా పురష్కారాలను అందుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్