గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition20న చలో పార్లమెంట్‌‌కు సిజెపి పిలుపు

2 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 12:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఎం సీనియర్ నేతలు సుభాషిణి అలీ, బృందా కరత్ మద్దతు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఛలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. ఈనెల20న సిజెపి కార్యకర్తలు పార్లమెంటుకు పాదయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని గురువారం ప్రకటించారు. దీక్షలో ఉన్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. సిజెపి ఉద్యమానికి సిపిఎం సీనియర్ నేతలు బృందా కరత్, సుభాషిణి అలీ స్వయంగా కలిసి మద్దతు తెలిపారు. ఢిల్లీ పోలీసులు సిజెపి ఆందోళనకు మళ్లీ అడ్డంకులు సృష్టించారు. భారీ వర్షం కురవడంతో సిజెపి కార్యకర్తలు తలదాచుకోవడానికి టార్పాలిన్లు తీసుకొస్తే, ఢిల్లీ పోలీసులు అనుమతించలేదు. దీంతో సిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఢిల్లీ పోలీసులు టార్పాలిన్లను లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకుని అమానవీయంగా వ్యవహరించారని అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రకు భారీగా తరలిరావాలని సోనమ్‌ ‌వాంగ్‌ ‌చుక్‌ ‌యువతకు విజ్ఙప్తి చేశారు. చట్టాలు చేసే చోటే గొంతు వినిపించాలన్నారు. అయితే సోనమ్ వాంగ్‌చుక్, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్