నేటినుంచి ఇంగ్లండ్ మహిళలతో ఏకైక టెస్ట్
మధ్యాహ్నం 3.30గం.ల నుంచి
లండన్: భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య లార్డ్ వేదికగా ఏకైక టెస్ట్ శుక్రవారం నుంచి ప్రారం భం కానుంది. ఈ టెస్ట్‌కు ముందు జరిగిన మూడు టి20ల సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న హర్మన్‌ప్రీత్ సేన ఏకైక టెస్ట్‌ను గెలుపుతో ముగించాలని చూస్తోంది. ఈ టెస్ట్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ బ్యూమౌంట్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఇంగ్లండ్ గెలుపుతో ముగించాలని దృఢ నిశ్చయంతో ఉంది. దీంతో ఇరుజట్ల మధ్య నేటినుంచి ప్రారంభమయ్యే ఏకైక టెస్ట్ హోరాహోరీగా సాగడం ఖాయం. భారత్‌తో జరిగే ఏకైక టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ టామీ బ్యూమాంట్ ప్రకటించింది. 2009లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్యూమౌంట్ 260 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
జట్లు(అంచనా)..
ఇండియా మహిళలు: హర్మన్(కెప్టెన్), మంధాన, షెఫాలీ, రోడ్రిగ్స్, రీచా(వికెట్‌కీపర్), హర్లిన్, దీప్తి, రేణుకా, సయాలీ, క్రాంతి గాడ్, శ్రీచరణి.
ఇంగ్లండ్ మహిళలు: స్కీవర్ బ్రంట్(కెప్టెన్), బ్యూమౌంట్, హీథర్, కాప్సే, అమీ జోన్స్(వికెట్ కీపర్), లాంబ్, ఎక్లేస్టోన్, బెల్, పోట్స్, వాంగ్, కర్టెన్స్.







కామెంట్‌లు (0)