ప్రజాశక్తి - వేపాడ : ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే అనుకూలించడంతో ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకున్నాయి. రైతులు వరి నారుమళ్లు సిద్ధం చేసుకుని, విత్తనాలు వేసే పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు వేపాడ మండలంలో ఖరీఫ్ వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నారుమళ్లను సిద్ధం చేసుకున్న రైతులు వరి విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వల్లంపూడి రెవెన్యూ పరిధిలో శనివారం రైతులు పొలాల్లో వరి విత్తనాలు వేస్తూ కనిపించారు.
ముమ్మరంగా సాగుతున్న ఖరీఫ్ పనులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)