mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

AI talent - ఎఐ టాలెంట్‌కు కోట్ల వేతనాలు.. ఆంథ్రోపిక్‌లో భారీ ప్యాకేజీలు ..!

2 గంటల క్రితం

Multi-crore salaries for AI talent... massive packages at Anthropic!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సైటెక్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎఐ సంస్థ Anthropic (ఆంథ్రోపిక్‌) తన సాంకేతిక నిపుణులకు అందిస్తున్న భారీ వేతనాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సంస్థ అభివృద్ధి చేస్తున్న Claude, మైథోస్ వంటి ఎఐ మోడళ్లపై పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల వార్షిక ప్రాథమిక వేతనం (బేస్ పే) గరిష్ఠంగా రూ.13 కోట్ల వరకు ఉందని వెల్లడైంది. ఈ మొత్తంలో పనితీరు బోనస్‌లు, స్టాక్‌ ఆప్షన్లు (ఈక్విటీ) లెక్కలో లేవు.


ఇటీవల నిర్వహించిన నిధుల సమీకరణ అనంతరం ఆంథ్రోపిక్‌ సంస్థ విలువ 965 బిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఈ తాజా పెట్టుబడులను కంప్యూటింగ్‌ సామర్థ్యాల విస్తరణ, అత్యాధునిక ఎఐ మోడళ్ల అభివృద్ధి, భద్రతకు సంబంధించిన పరిశోధనల కోసం వినియోగించనున్నట్లు సంస్థ తెలిపింది.


హెచ్‌-1 బి దరఖాస్తులతో బయటపడిన వేతన వివరాలు ....


అమెరికా ప్రభుత్వానికి సమర్పించిన హెచ్‌-1 బి వీసా దరఖాస్తుల ఆధారంగా ఉద్యోగుల వేతనాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ విశ్లేషణ ప్రకారం, "మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌" హోదాలో ఉన్న ఇద్దరు ఉద్యోగులకు వరుసగా 1.12 మిలియన్‌ డాలర్లు, 1.38 మిలియన్‌ డాలర్ల వార్షిక బేస్‌ పే నమోదైంది. అయితే ఈ హోదాను సంస్థ వివిధ సాంకేతిక బృందాల్లో ఉపయోగిస్తుండటంతో వారి కచ్చితమైన బాధ్యతలు వెల్లడికాలేదు. ఈ గణాంకాల్లో స్టాక్‌ అవార్డులు, పనితీరు ఆధారిత బోనస్‌లు చేర్చలేదని పేర్కొన్నారు.


ప్రధాన విభాగాల్లో వార్షిక బేస్‌ పే ....

మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌: రూ.1.26 కోట్లు – రూ.13.02 కోట్లు

మెంబర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (మేనేజర్‌): రూ.1.26 కోట్లు – రూ.8.02 కోట్లు

రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ రీసెర్చర్‌: రూ.1.06 కోట్లు – రూ.4.71 కోట్లు

ప్రొడక్ట్‌ డిజైన్‌ మేనేజర్‌: రూ.1.32 కోట్లు – రూ.3.60 కోట్లు

ప్రొడక్ట్‌ ఆపరేషన్స్‌: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లు

అకౌంటింగ్‌: రూ.1.33 కోట్లు – రూ.2.17 కోట్లు

కమర్షియల్‌ కౌన్సెల్‌: రూ.1.87 కోట్లు – రూ.3.01 కోట్లు

ఫైనాన్స్‌ అండ్‌ స్ట్రాటజీ: రూ.1.72 కోట్లు – రూ.2.92 కోట్లు

మార్కెటింగ్‌: రూ.1.50 కోట్లు – రూ.1.88 కోట్లు

రీసెర్చ్‌ ఆపరేషన్స్‌: రూ.1.17 కోట్లు – రూ.4.71 కోట్లు

టెక్నికల్‌ సేల్స్‌: రూ.1.46 కోట్లు – రూ.4.71 కోట్లు

ప్రతిభ కోసం ఏఐ కంపెనీల మధ్య పోటీ


అమెరికాలో హెచ్‌-1 బి వీసాలకు సంబంధించిన అనిశ్చితి కారణంగా అనేక రంగాల్లో నియామకాలు మందగించినప్పటికీ, Anthropic, OpenAI, NVIDIA వంటి ప్రముఖ ఎఐ సంస్థలు అత్యుత్తమ ప్రతిభను తమవైపు ఆకర్షించేందుకు భారీ వేతన ప్యాకేజీలు, స్టాక్‌ ఆప్షన్లతో నియామకాలను కొనసాగిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లోనే ఆంథ్రోపిక్‌ దాదాపు 80 హెచ్‌-1 బి ఉద్యోగాలకు సర్టిఫికేషన్‌ పొందినట్లు సమాచారం. అత్యున్నత వేతనాలతో పాటు దీర్ఘకాలిక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ప్రతిభావంతులను సంస్థలోనే నిలబెట్టుకోవడమే ఆంథ్రోపిక్‌ వ్యూహమని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్