mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలి : ఉదయనిధి స్టాలిన్

3 గంటల క్రితం

Udhayanidhi urges Speaker
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్ స్పీకర్ ను కోరారు. శనివారం ఆయన స్పీకర్ జె.సి.డి ప్రభాకర్ కు లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే.. అసెంబ్లీ సమావేశాల ఉద్దేశ్యాన్ని దెబ్బతీసినట్లు, ఓటు వేసి గెలిపించిన ప్రజలను అగౌరవపరిచినట్లేనని అన్నారు. మీరు స్పందించకపోతే అసెంబ్లీని, సభ్యులను అవమానపరిచినట్లేనని లేఖలో పేర్కొన్నారు. సోమవారం జరగనున్న గవర్నర్ ప్రసంగంలో తాను, ఇతర పార్టీ సభ్యులు పాల్గొంటామని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి హామీ ఇచ్చారని కానీ, గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చను ప్రసారం చేయలేదని అన్నారు. గత రెండు మూడేళ్లుగా నిలిపివేయబడిన అసెంబ్లీ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని తిరిగి ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి తన హామీని నెరవేర్చారని సమాచార శాఖ మంత్రి రాజ్ మోహన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆ మంత్రి ప్రకటన చేసిన రోజే ఆ ప్రసారం నిలిపివేయబడిందని అన్నారు. మేకెదాటు వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చను ప్రత్యక్ష ప్రసారం చేసినప్పటికీ, గవర్నర్ ప్రసంగంపై చర్చ మొదలైనప్పుడు మాత్రం ఆ ప్రసారాన్ని నిలిపివేశారని ఆయన స్పష్టం చేశారు. ఇది విజయ్ ప్రభుత్వ హామీకి విరుద్ధమని, ఇది ప్రజా ప్రతినిధుల గొంతుకను అణచివేయడమే అవుతుందని, అలాగే సభ గౌరవ మర్యాదలకు ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉండేలా చర్చల వీడియోలను ఎడిట్ చేసి విడుదల చేయడమంటే.. ఇది ఎమ్మెల్యేల భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే చర్య అని అన్నారు. హామీని విస్మరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్