mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జంతర్‌ మంతర్‌ వద్ద సిజెపి మరోసారి నిరసన

2 గంటల క్రితం

Cockroach Janta Party protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) ఢిల్లీలోని జంతర్‌‌మంతర్‌ ‌వద్ద మరోసారి నిరసన చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుండి సిజెపి మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆ ప్రదేశాన్ని పోలీసులు బలగాలు మోహరించాయి. నిరసన జరిగే ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆ ప్రదేశంలో మోహరించిన పోలీసు సిబ్బంది సుమారు 270 బాడీ-వోర్న్ కెమెరాలను ఉపయోగిస్తారని అధికారులు వెల్లడించారు.

కాగా, నీట్‌ ‌పేపర్‌‌ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ డిమాండ్‌ ‌చేస్తోంది. జూన్‌ 6‌వ తేదీన తొలిసారి జంతర్‌‌మంతర్‌ ‌వద్ద నిరసన చేపట్టింది. మళ్లీ ఈరోజు (జూన్‌ 20)వ తేదీన రెండోసారి అక్కడ నిరసన చేస్తోంది. సిజెపి మద్దతుదారులు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని రాసిన ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.









ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్