ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యువశక్తికి మరేదీ సాటిరాదు!

10 గంటల క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 11:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సమస్యల నెలవుగా 
అలహాబాద్‌ వర్శిటీ

- ప్రయాగ్‌‌రాజ్‌‌ ‘ఛాత్రౌం కీ గూంజ్‌’ సభలో రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : భారతదేశం యొక్క అత్యంత గొప్పశక్తి ఈ దేశంలోని యువతే అని ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. వారికి గల శక్తి సామర్ధ్యాలు ప్రపంచంలోని మరే దేశ యువతకు సాటిరావని అన్నారు. అటువంటి యువతకు ఉద్యోగావకాశాల కొరత నేపథ్యంలో నేడు విద్యార్హతల విలువపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రయాగ్‌‌రాజ్‌‌లో ‘ఛాత్రౌం కీ గూంజ్‌’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో రాహుల్‌ ‌ప్రసంగించారు. అలహాబాద్‌ ‌వర్శిటీ సమస్యల నెలవుగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ వేదిక వద్ద పరిస్థితులు సరిగా లేనప్పటికీ పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, పోటీ పరీక్షలకు హాజరువుతున్న అభ్యర్ధులు హాజరయ్యారు. ‘మీరే భారత్‌‌కు శక్తి, గర్వకారణం’ అని వారినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ దేశంలోని ప్రతి ఒక్క భారతీయ పౌరుడి గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు. ‘దర్ద్‌ (‌నొప్పి, బాధ), డేటా, దౌలత్‌ (‌సంపద) గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం 40 కోట్ల మంది యువత వున్నారని, భారతదేశంలోని యువత మరెవరికీ సాటి రారని తరచుగా అమెరికా, చైనా, రష్యాలు మాట్లాడుతునే వుంటాయని అన్నారు.

దేశంలో విద్యా అర్హతల ప్రమాణాలు పడిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. నేడు భారత్‌‌లో విద్యా సర్టిఫికెట్లకు ఎలాంటి విలువ లేదని, ఆ కాగితాలతో వారికెలాంటి ఉద్యోగం రావడం లేదని అన్నారు. తయారీ రంగం క్షీణిస్తోందని, రుణాల రావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పరీక్షా పత్రాలు లీకవుతున్నాయని, కృత్రిమ మేథతో ఉద్యోగాలు పోతున్నాయని ఇవన్నీ కలిసి యువతకు గల అవకాశాలను దెబ్బ తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే విద్వేషం, హింసలకు పాల్పడరాదని ఆయన వారికి సూచించారు. ప్రేమాభిమానాలతో వ్యవస్థను మార్చడానికి ప్రయ త్నించాలని సూచించారు. ప్రతి యువశక్తికి మరేదీ సాటిరాదు!

వెయ్యి మందిలో కేవలం 12 మందికే పర్మినెంట్‌ ఉద్యోగం వస్తోందన్నారు. 21వ శతాబ్దంలో దేశ పురోగతి అనేది రెండు అంశాలు - యువతకున్న శక్తి సామర్ధ్యాలు, వారు సృష్టించే డేటా ఆధారపడి వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అలహాబాద్‌ ‌యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలను రాహుల్‌ ‌వివరించారు. వర్శిటీలో ఫీజులను గతంలో కంటే 400 శాతం అధికంగా పెంచారని, హాస్టల్‌ ‌ఫీజులు కూడా భారీ పెంచేశారని తెలిపారు. గ్రంథాలయం కేవలం 8 గంటలే తెరిచివుంచుతున్నారని, వర్షాల సమయంలో నీళ్లతో నిండిపోతోందని తెలిపారు. గ్రంధాలయాన్ని 24 గంటలూ తెరిచివుంచాలని కోరితే..‘ఏంటి ఎక్కువ చదివేసి..కలెక్టరు అయిపోదామే’ అంటూ అక్కడి సిబ్బంది విద్యార్థులను ఎగతాళి చేసి మాట్లాడుతున్నారని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్శిటీలో నీళ్లు మంచిగా లేవని విద్యార్థులు ఫిర్యాదు చేస్తే..వర్శిటీ అనేది మంచి నీళ్ల కేంద్రం కాదంటూ అధికారులు బదులిస్తున్నారని ఆయన వాపోయారు. ‘అందుకనే ఇక్కడ మీ స్వరాన్ని వినేందుకు, వాటిపై అధికారులను నిలదీసేందుకు వచ్చాను. వాళ్లు మన మీద కేసులు పెడితే పెట్టుకొని భయపడేది లేదు’ అని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్‌ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్