కొచ్చి : కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా మోనాలిసాకు గతంలో పరిచయం ఏర్పడింది. ఎనిమిది నెలల ప్రేమ అనంతరం వారిద్దరూ కేరళలోని తిరువనంతపురంలో ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కేరళలో నివాసముంటున్నారు. అయితే, మోనాలిసా మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఆరోపించడంతో ఫర్మాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల ప్రారంభంలో ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన కేరళ హైకోర్టుకు చెందిన మరో ధర్మాసనం కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మధ్యప్రదేశ్ కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా మోనాలిసా భర్తకు నెల రోజుల పాటు ‘ట్రాన్సిట్ బెయిల్’ మంజూరు చేసింది. అయితే ఫర్మాన్‌ఖాన్‌ను మతాంతర వివాహం చేసుకొన్న మోనాలిసా కోర్టుకెక్కింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన కిడ్నాప్, పోక్సో కేసుల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ రిట్ పిటిషన్ పరిష్కారం అయ్యేవరకు ఆమె ప్రాణాలకు రక్షణ కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది.
కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి : హైకోర్టు ఆదేశం
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)