mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులు ప్రచారంలో పాల్గొనండి : రాహుల్‌ పిలుపు

15 గంటల క్రితం

Rahul gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ‌విద్య, పరీక్షలు, ఉపాధికి సంబంధించి తమ సమస్యలను నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రారంభించిన 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గళం) ప్రచారంలో చేరాలని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం విద్యార్థులు, ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు.

కాగా, మీరు పేపర్ లీక్‌లు, పరీక్షలలో మోసాలు, లేదా అధిక ఫీజుల వంటి బాధలను భరించి ఉంటే... ఈ వ్యవస్థ మీ కలలను ఛిన్నాభిన్నం చేసి ఉంటే... మీ కుటుంబం తమ జీవితకాల సంపాదనను మీ చదువు కోసం ధారపోసి ఉంటే... అయితే వినండి: 'స్టూడెంట్స్ ఎకో' మీ గొంతుక. ఇది కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాదు. మీకు అందుబాటు ధరలోకి విద్యనందించాలని, న్యాయబద్ధంగా పరీక్షల్ని నిర్వహించాలని, గౌరవప్రదమైన ఉపాధికి సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడానికి ఇది ఒక వేదిక అని గాంధీ అన్నారు సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రచారంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పిటిషన్‌‌పై సంతకం చేయాలని, సూచనల్ని సమర్పించాలని ప్రజలకు రాహుల్‌ ‌విజ్ఞప్తి చేశారు. మీ ఒక్క సంతకం ఈ పోరాటాన్ని బలపరుస్తుంది. ఎంత ఎక్కువ మంది పేర్లు ఉంటే, ఆ గళం అంత బలంగా వినిపిస్తుంది అని రాహుల్‌‌గాంధీ పోస్టులో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్