mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశంకుస్థాపనల్లోనే కడప 'ఉక్కు'!

2 గంటల క్రితం

kadapa steel plant.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 06:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

• ఎనిమిదేళ్లలో నాలుగుసార్లు శంకుస్థాపనలు

• తాజాగా జులై 3న ఐదోసారి

• బాధ్యత గాలికొదిలేసిన కేంద్ర ప్రభుత్వం

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం శంకుస్థాపనలకే పరిమితమవుతోంది. రాష్ట్ర విభజన చట్టం 2014లోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే హామీ కేంద్రంలోని బిజెపి సర్కారు, రాష్ట్ర ఇద్దరు ముఖ్యమంత్రుల సాక్షిగా పరిహాసం పాలైంది. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని ఎన్‌‌డిఎ సర్కారు ఫీజిబులిటీ లేదనే పేరుతో అంతులేని నిర్లక్ష్యం వహించింది. అప్పటి సిఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతుందని ప్రకటించారు. 2018 డిసెంబర్ 27న రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరిట కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో 3,295 ఎకరాల స్థలంలో ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. 2019లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసిపి అధ్యక్ష హోదాలో వైఎస్‌.జగన్‌ తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 2019 డిసెంబర్ 27న ఎపి హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ పేరిట శంకుస్థాపన చేశారు. కరోనా అనంతరం 2023 డిసెంబర్ 27న వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ గా పేరు మార్చి కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలోని పెద్దదండ్లూరు - సున్నపురాళ్ల సమీపంలోని 3,148 ఎకరాల్లో మరోసారి శంకు స్థాపన నిర్వహించారు. రూ.16 వేల కోట్లతో ఆరు టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని రెండు దశల్లో ఏర్పాటుకు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. అప్పటి వైసిపి ప్రభుత్వం దేశంలోని దిగ్గ ఉక్కు కంపెనీలను ఆహ్వా నించింది. భాగస్వామ్య కంపెనీల ఎంపిక కోసం టెండర్లు పిలిచింది. లిబర్టీ స్టీల్, ఎస్సార్ స్టీల్స్, హుండాయ్, టాటా స్టీల్స్ పాల్గొన్నాయి. ఎల్-1గా ఏస్బీఐ క్యాప్ సిఫారసుల మేరకు లిబర్టీ స్టీల్ ఇండియా లిమిటెడ్ ఎంపికైంది. తొలి దశలో రూ.10,082 కోట్లు, రెండవ దశలో రూ.6,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని ఆ కంపెనీ పేర్కొంది. ఫేస్-1లో మూడు మిలియన్ టన్నులు, ఫేస్-2 లో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపింది. ఇంతలో ఆ కంపెనీ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందని చెప్పి

ప్రాజెక్టు నిలిపివేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ 2003 డిసెంబర్లో జె ఎస్ డబ్ల్యూ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని శంకుస్థాపన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

2025 మేలో కడపలో నిర్వహించిన టిడిపి రాష్ట్ర మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 12 లోపు కడప ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. అంతకుముందు మీడియా చిట్ చాట్ లో ఆయన కుమారుడు, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మంత్రి మండలి సమావేశం అనంతరం మాట్లాడుతూ జులై మూడున మరోసారి కడప ఉక్కు పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని ప్రకటించారు. కడప ఉక్కు పరిశ్రమకు ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో ఎనిమిదేళ్లలో ఐదోసారి శంకుస్థాపన చేసిన ఘనత వహించనున్నారు. వైసిపి హయాంలోని రూ.500 కోట్లతో చేపట్టిన ఉక్కు పరిశ్రమ మౌలిక వసతుల పనులకు బిల్లుల చెల్లింపు జరగలేదు.

అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి ప్రభుత్వాలు రెండూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తాయి తప్ప, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి హక్కుగా ఉన్న కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రమే నిర్మించాలని పట్టుబట్టింది లేదు. కనీసం ఈ మేరకు విజ్ఞప్తి చేసిన దాఖలాలు లేవు. శంకుస్థాపనలతోనే కాలం గడిపేస్తున్నారు. అసలు దోషి బిజెపి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం తన బాధ్యత లేదన్నట్లు వ్యవహరిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్