గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతిరుపతి టూరిజం ప్రైవేట్ పరం

1 గంట క్రితం

TIRUPATI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 02:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మృగవాని రిసార్ట్స్‌కు ఏడాది లీజు కోటి రూపాయలు

  • 33 ఏళ్ల అగ్రిమెంట్ ఖరారు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుపతి టూరిజం ప్రైవేట్ పరమవుతోంది. తిరుపతి అలిపిరి వద్ద శ్రీవారి పాదాల చెంత రూ.వంద కోట్ల ఆస్తిని హైదరాబాద్ కు చెందిన మృగవాని రిసార్ట్స్ కు అప్పగించింది. ఏడాదికి కోటి రూపాయల లీజుకు 33 ఏళ్ల పాటు అగ్రిమెంట్ సైతం ఖరారు అయ్యింది. యుద్ధ ప్రాతిపదికన సంస్థ పనులను ప్రారంభించింది. దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా టూరిజం ఆస్తి కార్పొరేట్ల పరమవుతోంది. గతంలో ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు అద్దె అడిగిన సంస్థలను వదులుకొని, తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వం రూ.కోటికే లీజు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలిపిరిలో 1.03 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం నుంచి ఏడుకొండల అందాలు కనువిందు చేస్తాయి. రుయా ఆసుపత్రికి_ అలిపిరి ఫుట్‌పాత్ ప్రవేశ ద్వారానికి మధ్య అనువైన ప్రదేశంలో ఉంది. 2013లో_ ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్ట్‌లో 110 గదులు, 200 సీట్ల రెస్టారెంట్, డార్మిటరీ తరహా వసతులు, ఒక సమావేశ మందిరం, ఆంధ్రప్రదేశ్ టూరిజం_ డెవలప్‌‌మెంట్‌ కార్పొరేషన్ కార్యాలయానికి స్థలం ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. సుమారు వంద కార్లను పార్క్ చేయగల భారీ పార్కింగ్ ప్రాంతంగా_ ప్రణాళికలను రూపొందించారు. ఈ_ ప్రాజెక్టును మొదట టూరిజం శాఖ నడపాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి ఇవ్వాలని సంకల్పించింది.

2016 నాటికి రూ.20 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టినప్పటికీ, నిధుల కొరత, పదేపదే బడ్జెట్‌లో ఎదురవుతున్న అడ్డంకుల కారణంగా ఈ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వ సహకారం అందించకపోవడంతో టూరిజం శాఖ చేతులెత్తేసింది. ఈ హోటల్ ద్వారా ఏటా రూ.5 - రూ.6 కోట్ల వరకు ఆదాయం, సుమారు రూ.మూడు కోట్ల నికర లాభాలు వస్తాయని అంచనా వేస్తూ, ఈ సదుపాయాన్ని స్వయంగా పూర్తి చేసి, నిర్వహించడానికి టూరిజం శాఖ అనేక సంవత్సరాలుగా మార్గాలను అన్వేషించింది. అయినప్పటికీ, హోటల్ నిర్వాహకుల నుండి ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే హోటల్ యజమానులు తక్కువ మొత్తాన్నే ఆఫర్ చేసి ప్రాజెక్ట్‌ను త్వరగా ముగించాలని ప్రయత్నించారు. 2018లో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అదనంగా మరో రూ.పది కోట్లు పెట్టుబడి పెట్టాలని తిరుపతి కార్పొరేషన్ భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ ఆమోదం పొందలేకపోయింది._ 2019 ప్రారంభంలో తాజ్, వివాంత వంటి ప్రఖ్యాత బ్రాండ్‌లను నిర్వహిస్తున్న టాటా గ్రూప్‌నకు చెందిన ది ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ తో టూరిజం శాఖ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. అయితే, అధికారిక ఆసక్తి పత్రం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ మరోసారి ప్రభుత్వ ఆలస్యాన్ని ఎదుర్కొంది. దీంతో అసంపూర్తిగా ఉన్న హోటల్ అటకెక్కింది. ఈ నేపథ్యంలో 8-9 సంవత్సరాలుగా భవన నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. మూడు నెలల క్రితం టిడిపి కూటమి హయంలో మృగవాని కంపెనీ తెరపైకి వచ్చి, కారుచౌకగా కోటి రూపాయలకే లీజుకు తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

రూ.కోటికే లీజు : శ్రీనివాసరావు, డివిజనల్ మేనేజర్ తిరుపతి టూరిజం

ఏడాదికి కోటి రూపాయలకే ఎపి టూరిజం స్థలాన్ని, అసంపూర్తిగా ఉన్న భవనాన్ని మృగవాని కంపెనీకి మూడునెలల క్రితమే అప్పగించాం. ప్రస్తుతం ఆ కంపెనీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఏడాదిలో పూర్తిచేసి, యాత్రికులకు అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదిరింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్