mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWomen's T20 World Cup: సెమీస్‌‌కు చేరాలంటే.. ఆ రెండు మ్యాచుల్లో గెలవాల్సిందే

2 రోజుల క్రితం

team india womens
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 01:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

లండన్‌: ఐసిసి మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై ‌గెలిచి జోరుమీదున్న భారత మహిళలజట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో అనూహ్యంగా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికాపై గెలిస్తే సెమీస్‌‌కు చేరడం పక్కా అనుకున్న దశలో ఆ జట్టు చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో హర్మన్‌‌ప్రీత్‌ ‌సేన సెమీఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాలపై భారతజట్టు గెలిస్తేనే సెమీస్‌‌కు చేరనుంది. భారతజట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. ఐదు మ్యాచ్‌లకు గాను నాలుగు విజయాలు, ఒక ఓటమితో ఎనిమిది పాయింట్లతో గ్రూప్ దశను ముగిస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా చివరి రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌‌లోనైనా ఓడాలి. ఎందుకంటే పటిష్ట ఆస్ర్టేలియాను టీమిండియా ఓడించాలంటే చెమటోడ్చాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఆస్ర్టేలియా చేతిలో ఓడింది.

సమీకరణలు ఇలా...

భారత్ సెమీస్ చేరాలంటే దక్షిణాఫ్రికా జట్టు తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కదానిలోనైనా ఓడాలి. అప్పుడే రన్ రేట్ పరంగా భారత్‌కు టాప్-2 లో నిలిచే అవకాశం ఉంటుంది. అయితే, దక్షిణాఫ్రికా తదుపరి మ్యాచ్‌లు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ వంటి బలహీనమైన జట్లతో ఆడాల్సి ఉండడం వారికి కలిసివచ్చే అంశం. మరోవైపు భారత్ తన తదుపరి మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌తో పాటు, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన బలమైన ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ రెండు గెలిస్తే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్‌ ఒక్కో మ్యాచ్‌‌లో ఓడినట్లవుతుంది. దీంతో మెరుగైన రన్‌‌రేట్‌ ‌కలిసి రెండుజట్లు సెమీస్‌‌కు చేరతాయి. ఇక ఆస్ట్రేలియా జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు కూడా రెండేసి విజయాలతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు మరో రెండు మ్యాచ్‌‌లు మిగిలి ఉండగానే ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారతజట్టు 25న బంగ్లాదేశ్‌తో, 28న ఆస్ట్రేలియాతో వంటి బలమైన జట్టును లార్డ్స్ మైదానంలో తలపడనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌‌ వ్యక్తిగత రికార్డులతో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లోనే 159 పరుగులు చేసి టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బౌలింగ్‌లో శ్రీ చరణి మూడు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లపై మూడేసి వికెట్లు తీసిన ఆమె, నెదర్లాండ్స్‌పై నాలుగు వికెట్లతో చెలరేగింది.


ఐసిసి మహిళల వన్డే ప్రపపంచకప్ లో నేడు...

న్యూజిలాండ్ × స్కాట్లాండ్ (మ.3.00గం.లకు)

శ్రీలంక × ఐర్లాండ్(రా.7.00గం.లకు)

ఆస్ర్టేలియా × పాకిస్తాన్(రా.11.00గం.లకు)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్