mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Women's T20 World Cup: స్టార్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం

23 గంటల క్రితం

Shreyanka Patil twisted her ankle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 18, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత మహిళా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న శ్రేయాంక పాటిల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో మిడ్-ఆన్ దిశగా వచ్చిన బంతిని అడ్డుకునే క్రమంలో శ్రేయాంక కుడి కాలి చీలమండ తీవ్రంగా బెణికింది. దీంతో ఆమె మైదానంలోనే కుప్పకూలి నొప్పితో విలవిలలాడారు. జట్టు ఫిజియో తక్షణమే మైదానంలోకి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, ఆమె కనీసం నిలబడలేని స్థితిలో ఉండటంతో స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం గాయం తీవ్రతను అంచనా వేసేందుకు ఆమెను స్కానింగ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీసీసీఐ స్పందిస్తూ.. శ్రేయాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రస్తుతం మెడికల్ టీమ్ ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాయం తీవ్రతపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

హెడింగ్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించినప్పటికీ, శ్రేయాంక గాయం జట్టును తీవ్ర ఆందోళనలో పడేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్