mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గర్జించిన బ్రెజిల్

3 గంటల క్రితం

brazil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:52 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హైతీపై 3-0తో గెలుపు

న్యూయార్క్‌: ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 గ్రూప్-సి మ్యాచ్‌లో బ్రెజిల్ జ‌ట్టు ఘన విజ‌యం సాధించింది. హైతీతో శనివారం జ‌రిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. బ్రెజిల్ ప్లేయ‌ర్ మాథ్యూస్ కున్హా రెండు గోల్స్ చేయగా.. వినిసియ‌స్ జూనియ‌ర్ మ‌రో గోల్ చేశాడు. మాథ్యూస్ కుహా (ఆట 23, 36వ నిమిషాలు) గోల్స్ చేయ‌గా, స్టార్ ప్లేయ‌ర్ వినిసియ‌స్ జూనియ‌ర్ తొలి అర్ధభాగం అదనపు సమయంలో (45+3వ నిమిషం) గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి బ్రెజిల్‌ ‌జట్టు 3-0 ఆధిక్యతలో నిలిచింది. స్ట్రయిక‌ర్ ఇగోర్ థియాగో స్థానంలో ఆడిన కున్హా.. 23వ నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. హైతీ డిఫెండ‌ర్ హ‌న్నెస్ డిల్‌క్రాక్స్‌కు బంతి త‌గిలి నెట్‌లోకి దూసుకెళ్లింది. వినిసియ‌స్ జూనియ‌ర్ ఇచ్చిన పాస్‌ను టాప్ కార్న‌ర్ షాట్‌తో కున్హా గోల్‌గా మ‌లిచాడు. ఇక రెండో అర్ధభాగంలో ఇరుజ‌ట్లు గోల్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. అయితే రెండో అర్ధభాగంలో బ్రెజిల్ ప‌లుమార్లు హైతీ గోల్ పోస్టుపై దాడులు చేసిన‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు గోల్ కీప‌ర్ వాటిని స‌మ‌ర్థంగా అడ్డుకున్నాడు. ఈ విజ‌యంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న బ్రెజిల్ ప‌ట్టిక‌లో తొలి స్థానానికి ఎగబాకింది. అలాగే రౌండ్-32కు అర్హ‌త సాధించేందుకు బ్రెజిల్ అడుగుదూరంలో నిలిచింది. ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఒక మ్యాచ్‌లో మూడు గోల్స్ అంత‌కంటే ఎక్కువ కొట్ట‌డం బ్రెజిల్‌కు ఇది 41వ సారి. బ్రెజిల్ త‌ర్వాత జ‌ర్మ‌నీ (36 సార్లు) మాత్ర‌మే అత్య‌ధికంగా మూడు గోల్స్ కొట్టిన సంద‌ర్భాలున్నాయి. ఇక బ్రెజిల్ స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌ య్యాడు. నెయ్‌మ‌ర్ 24న స్కాట్లాండ్‌తో చివ‌రి మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌ ముంది. తొలి మ్యాచ్‌‌లో మొరాకోపై 1-1తో డ్రా చేసుకొని పలు విమర్శలను ఎదుర్కొంది. దీంతో సాంబా జట్టు ఈ మ్యాచ్‌‌లో మరింత దూకుడుగా ఆడడం విశేషం. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ప్లేయ‌ర్ రాఫినా గాయ‌ప‌డ్డాడు. అత‌ని స్థానంలో ర‌యాన్‌ ఆడాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్