- 13 ఏళ్ల తర్వాత కైవసం
- సౌత్‌జోన్‌తో మ్యాచ్ డ్రా
చెన్నై: ఈస్ట్ జోన్ జట్టు దులీప్ ట్రోఫీ టైటిల్‌ను 13ఏళ్ల తర్వాత చేజిక్కించుకుంది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించిన ఈస్ట్ జోన్ జట్టుకు టైటిల్ దక్కింది. ఐదో, చివరి రోజు ఈస్ట్ జోన్ ఏడు వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆ జట్టు 760 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే ఇద్దరు కెప్టెన్లు డ్రాకు అంగీకరించడంతో దులీప్ ట్రోఫీ ఈస్ట్‌జోన్ సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 212 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఈస్ట్ జోన్‌ను మొహమ్మద్ కౌనియన్ ఖురేషి(116నాటౌట్) సెంచరీకి తోడు అనుకుల్ రాయ్(64) అర్ధసెంచరీతో ఆదుకున్నారు. దీంతో ఈస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 99.2ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. సౌత్‌జోన్ బౌలర్లు నిధేశ్‌కు రెండు, సిరాజ్, విజయ్, రషీద్, మిలింద్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 708 పరుగులు చేయగా.. సౌత్ జోన్ తొలిఇన్నింగ్స్‌లో 336 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈస్ట్‌జోన్ జట్టుకు 372పరుగుల భారీ ఆధిక్యత అభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్‌కు, సిరీస్ తిలక్ వర్మకు దక్కాయి. దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ఈస్ట్ జోన్ గెలవడం ఇది మూడోసారి మాత్రమే. ఇక ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 350 పరుగులు చేసి మాజీ క్రికెటర్ రమణ్ లంబా(320 పరుగులు) రికార్డును అధిగమించాడు.







కామెంట్‌లు (0)