శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంత పరిపూర్ణంగా ఉన్నా ...

1 గంట క్రితం

ఎంత పరిపూర్ణంగా ఉన్నా ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 08:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షపై నటి కృతిశెట్టి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. పురుషులతో పోలిస్తే మహిళలు తమను తాము నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. 'వెండితెరపై పురుషులు చేసే పనులకు పెద్దగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రేక్షకులు వారిని త్వరగా ఇష్టపడతారు. కానీ ఒక మహిళ ఎంత పరిపూర్ణంగా ఉన్నప్పటికీ, ఆమెలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు' అని తన పోస్టులో పేర్కొన్నారు. మహిళల పట్ల సమాజం అనుసరిస్తున్న ఈ వైఖరిపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 'ఉప్పెన' సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కృతిశెట్టి ప్రస్తుతం తమిళ చిత్రం 'జీనీ'లో నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్