శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్వాసితులందరికీ ఏకకాలంలో పరిహారం

58 నిమిషాల క్రితం

నిర్వాసితులందరికీ ఏకకాలంలో పరిహారం 
- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌
- రెండో రోజుకు చేరిన బైకు యాత్ర image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 08:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌

- రెండో రోజుకు చేరిన బైకు యాత్ర

పోలవరం నిర్వాసితులందరికీ ఏకకాలంలో పరిహారం అందించాలని, చింతూరు డివిజన్‌‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టులు, రహదారులను తక్షణం నిర్మించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం డిమాండ్‌ ‌చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన బైకు యాత్ర శుక్రవారానికి రెండో రోజుకు చేరుకుంది. చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి గ్రామంలో సిపిఎం అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించి‌న అనంతరం బైక్ ర్యాలీ ముందుకు కదిలింది. బొడ్డుగూడెం, తుమ్మల గ్రామాల్లో అమరులైన పట్రా ముత్యం, అప్పారావు, సత్యనారాయణ, కుంజా సీతారామయ్య, బ్రహ్మయ్య స్తూపాలను సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నాయకులు నివాళులర్పించారు. పలు గిరిజన గ్రామాల్లో కల్వర్టులు కొట్టుకుపోయి, రహదారి సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను నాయకులు గుర్తించారు. తాగునీరు కలుషితమై అనారోగాల బారిన పడుతున్న జనం కష్టాలను నాయకులు తెలుసుకున్నారు. అన్ని చోట్లా యాత్రా బృందానికి ప్రజలు పూలమాలలు వేసి తమ గ్రామాల్లోకి ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు కొమ్ము నృత్యాలు చేశారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో లోకనాథం మాట్లాడుతూ... పోలవరం పరిహారంలో నిర్వాసితులకు రాష్ర్ట ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ముంపు ప్రజలకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వడం లేదన్నారు. యువతీ యువకులకు ఎలా అన్యాయం చేస్తోందో వివరించారు. అధికారంలోకి రాగానే పోలవరం పరిహారం అందిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటన చేసి గెలిచాక ఆ విషయాలను టిడిపి కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు మృగ్యమయ్యాయన్నారు. కొమ్మూరు గ్రామానికి సంబంధించి పరిహారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బైకు ర్యాలీలో పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, పల్లపు వెంకట్‌, జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్, పులి సంతోష్‌ ‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్