పాకిస్థాన్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ (55) తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటంబ సభ్యులు కరాచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాసిత్ అలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. బాసిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ వర్గాలు కోరుకుంటున్నారు. బాసిత్ అలీ 1993-96 మధ్య కాలంలో పాక్ తరపున 19 టెస్టులు, 50 వన్డేలు ఆడారు. మొత్తంగా 69 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆయన 2,123 పరుగులు చేశారు. అలీ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.
పాక్ మాజీ క్రికెటర్ కు తీవ్ర గుండెపోటు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)