మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ... ర్యాలీ మానవహారం

17 ఆగస్టు, 2026

Rally and human chain demanding the resolution of municipal workers' issues.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం కార్పొరేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ .... సోమవారం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, 14 పౌర సేవలు ప్రైవేటీకరణ ఆపాలని, మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సమస్యల పైన చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. సప్తగిరి సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి.మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ, జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, నగర అధ్యక్షులు గోపాల్ సిఐటియు నాయకులు రామిరెడ్డి, ప్రకాష్,ఎన్టీఆర్ శ్రీనివాసులు, ఆజాం, మున్సిపల్ ఇంజనీరింగ్ నాయకులు మల్లికార్జున, సంజీవ రాయుడు, ఓబుళపతి, మురళి, హెల్త్ సెక్షన్ నాయకులు లక్ష్మీ నరసమ్మ ,యర్రిస్వామి, లక్ష్మీనారాయణ,బంగ్లా రాఘవ, కమల్, పెన్నా, బత్తల ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్