ప్రజాశక్తి - జగ్గంపేట (కాకినాడ) : మండలంలోని మల్లిశాల అడ్డుకొండ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ రైతు కూలీ సంఘం సభ్యులు సోమవారం నిరసన ర్యాలీ చేశారు. గత మూడు దశాబ్దాలుగా తాము పోరాడుతున్న అడ్డకొండ భూములకు పట్టాలు ఇవ్వలేదని వెంటనే పట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్ సి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, ఏఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కుంచే అంజిబాబు, పి.డి.ఎస్.యు(వి)రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏపీ ఆర్ సి ఎస్ జిల్లా నాయకులు కే రామలింగేశ్వరరావు, జాను, గ్రామ కమిటీ నాయకులు బోడకుర్తి అబ్బులు, పోసమ్మ తదితరులు పాల్గొన్నారు.
అడ్డకొండ భూములు పేదలకు పంచాలి ..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 05:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)