శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్ల స్వీకరణకు ఆరు కేంద్రాలు : ఎంపీడీవో రాజు

11 నిమిషాల క్రితం

Six centres for receiving nominations: MPDO Raju
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ఈ నెల 29న మండలంలో 18 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలకు నామి నేషన్ల స్వీకరణకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో ఎ.రాజు శుక్రవారం తెలిపారు. ఆలమూరు పంచాయతీ వద్ద వి.నవీన్ కుమార్ అధ్వర్యంలో ఆలమూరు, జొన్నాడ పంచాయ తీల నామినేషన్లు, చొప్పెల్ల పంచాయతీ వద్ద పి.ఇందిరబాయి అధ్వర్యంలో చొప్పెల్ల, మూలస్థానం, నవాబుపేట గ్రామాలు, పెదపళ్ల పంచాయతీ వద్ద టి.రమాదేవి అధ్వర్యంలో పెదపళ్ల, కలవచర్ల, పెనికేరు గ్రామాలకు, చింతలూరు పంచాయతీ వద్ద జి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో చింతలూరు, సంధిపూడి, సూర్యారావుపేట, పిన పళ్ల గ్రామాలకు, నర్సిపూడి పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్.సూరిబాబు ఆధ్వర్యంలో నర్సిపూడి, మోదుకూరు, గుమ్మిలేరు గ్రామాలకు, మడికి పంచాయతీ కార్యాలయం వద్ద కె.ఎస్.ఎన్.కష్ణారెడ్డి అధ్వర్యంలో మడికి, చెముడులంక, బడుగువానిలంక పంచా యతీల నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో రాజు తెలిపారు. అలాగే నామినేషన్ల కు సంబంధించిన దరఖాస్తు ఫారాలు ఆయా కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ వలీ, తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్