క్రీడలు : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా …. శ్రీలంక ఎ తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో భారత ఎ జట్టు ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. ఐపిఎల్ 19వ సీజన్‌లో తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక ఎ బౌలర్లపై దాడికి దిగుతాడని భావించిన వైభవ్ 21 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. సమన్ అరాచిగే బౌలింగ్‌లో వికెట్ కోల్పోయిన అతడు మంచి ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మార్చుకోలేకపోయాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా నిలదొక్కుకోలేక 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో పవర్‌ప్లే దశలోనే భారత ఏ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ పరిస్థితిలో కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. జట్టును గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 13 ఓవర్లు ముగిసే సమయానికి భారత ఎ జట్టు 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. తిలక్ వర్మ 13 పరుగులతో, రుతురాజ్ గైక్వాడ్ 23 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత జట్టు పోటీ చేయగలిగే స్కోరు సాధించాలంటే ఈ భాగస్వామ్యం కీలకంగా మారనుంది.
IND-A vs SL-A : ఆరంభంలోనే ఇండియా ఎ తడబాటు – నిరాశపరిచిన వైభవ్
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 15, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)