ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : హత్యాయత్నం కేసులో నిందితులకు జైలు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం .... స్థానిక చెంచుపేట సంజీవి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద 2023 జూలై 10న రాత్రి స్థానిక సుందరయ్య నగర్ కు చెందిన వరికుంట్ల ఏసుదాసు నిలబడి ఉండగా, పాత కక్షల నేపథ్యంలో యడ్ల లింగయ్య కాలనీకి చెందిన తలవలస విజయబాబు అలియాస్ అప్పు, ఎం.శివకుమార్ అలియాస్ కుటేబు ఘర్షణ పడ్డారు. ఏసుదాసును ఎలాగైనా చంపుతామని బెదిరిస్తూ బీరు సీసా పగులగొట్టి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు అప్పటి త్రీ టౌన్ ఎస్సై విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. కేసు సోమవారం విచారణకు రావడంతో నిందితులపై నేరం రుజువు కావడంతో ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్ వెంకటేశ్వర రెడ్డి ఎ 1 నిందితుడు విజయబాబుకు పదేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. అలాగే రెండవ నిందితుడు ఎం.శివకుమార్ కు మూడేళ్ల జైలు, రూ.2 వేలు జరిమానా విధించారు, చెల్లించని పక్షంలో ఒక నెల జైలు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం సాంబశివరావు వాదించారు. నిందితులకు శిక్ష పడేలా సాక్ష్యాధారాలను సమర్పించిన పోలీసులను న్యాయమూర్తి అభినందించారు.
హత్యాయత్నం కేసులో నిందితులకు జైలు జరిమానా
51 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)