mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ టోర్నీలో పివి.సింధు ఓటమి

5 రోజుల క్రితం

PV Sindhu defeated in Australian Open tournament.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సిడ్నీ : ఆస్ట్రేలియ‌న్ బ్యాడ్మింట‌న్ ఓపెన్ టోర్నీలో హైద‌రాబాదీ ప్లేయ‌ర్ పివి.సింధు శనివారం జరిగిన సెమీఫైన‌ల్లో ఓటమిని చ‌వి చూసింది. జ‌పాన్‌కు చెందిన మేటి ప్లేయ‌ర్ అకేన్ య‌మ‌గుచి చేతిలో ఆమె వ‌రుస గేమ్స్‌లో ప‌రాజ‌యాన్ని ఎదుర్కొన్న‌ది. 20-22, 12-21 స్కోరుతో య‌మ‌గుచి విజ‌యం సాధించింది. మూడో నెంబ‌ర్ ర్యాంక్‌తో జ‌ప‌నీస్ ప్లేయ‌ర్ ఈ టోర్నీలో ఆడారు. కేవ‌లం 43 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. సింధు ఓట‌మితో బీడ‌బ్ల్యూఎఫ్ వ‌ర‌ల్డ్ టూర్ సూప‌ర్ 500 టోర్న‌మెంట్‌లో భార‌తీయ క్రీడాకారుల ప్రాతినిధ్యం ముగిసింది. ఫ‌స్ట్ గేమ్‌లో జ‌పాన్ ప్లేయ‌ర్‌కు దీటుగా సింధు ఆడింది. షాట్‌కు షాట్ కొట్టింది. ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఓ ద‌శ‌లో ఆరు వ‌రుస పాయింట్ల‌ను సాధించుకున్నారు. కానీ గేమ్ పాయింట్ వ‌ద్ద సింధు త‌డ‌బ‌డింది. ఓపెనింగ్ గేమ్‌ను య‌మ‌గుచి చేజిక్కించుకున్న‌ది. ఇక సెకండ్ గేమ్‌లో సింధు ఆట‌తీరు పూర్తిగా మారిపోయింది. య‌మ‌గుచి చాలా ఈజీగా దూసుకెళ్లింది. ఓ ద‌శ‌లో 13-6 పాయింట్లు సాధించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే య‌మ‌గుచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్న‌ది. ఇక సింగిల్స్ ఫైన‌ల్లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి పోర్న్‌పావీ చోచువాంగ్‌తో య‌మ‌గుచి త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఇటీవ‌ల య‌మ‌గుచి చేతిలో సింధు వ‌రుస‌గా ఓట‌మి ఎదుర్కొన్న‌ది. ఆరు మ్యాచుల్లో అయిదు సార్లు ఓడింది. కానీ ఓవ‌రాల్‌గా 15-13 తేడాతో సింధు లీడింగ్‌లో ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్