శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWimbledon: ఫైనల్‌‌కు ముఛోవా, నోస్కోవా

1 రోజు క్రితం

tennis
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చరిత్రలో తొలిసారి ఇద్దరు చెక్‌ క్రీడాకారిణుల మధ్య తుది పోరు

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లోకి చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు చేరారు. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో మూడుసెట్ల హోరాహోరీ పోరులో 12వ ర్యాంకర్‌ ముఛోవా 6-2, 1-6, 7-6(12-10)తో అమెరికా యువ సంచలనం 7వ ర్యాంకర్‌ కోకో గాఫ్‌ను చిత్తుచేయగా.. రెండో సెమీస్‌లో 9వ సీడ్‌ నోస్కోవా 6-4, 6-4తో వరుససెట్లలో 12వ ర్యాంకర్‌, ఉక్రెయిన్‌కు చెందిన కోస్ట్యూక్‌ను ఓడించారు. తొలి సెమీస్‌లో కోకో గాఫ్‌ చెక్‌ ‌రిపబ్లిక్‌‌కు చెందిన ముఛోవానకు ముచ్చెమటలు పట్టించింది. తొలి సెట్‌‌ను 2-6తో ఓడిన గాఫ్‌.. ఆ తర్వాత సెట్‌‌ను 6-1తో చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో, చివరి సెట్‌‌లోనూ గాఫ్‌ అంచనాలకు మించి రాణించింది. టైబ్రేకర్‌‌కు వెళ్లిన ఆ సెట్‌‌ను ఒక దశలో 2-6పాయింట్లతో వెనుకబడింది. ఆ తర్వాత పుంజుకొని 6-6తో స్కోర్‌‌ను సమం చేసింది. అదే జోరుకు కొనసాగిస్తూ.. 10-10పాయింట్ల సమంగా నిలిచింది. ఆ దశలో ముఛోవా వరుసగా రెండు పాయింట్లు కొట్టి మ్యాచ్‌ను ముగించింది. శనివారం వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ చర్రితలో తొలిసారి ఇద్దరు చెక్‌ పబ్లిక్‌ క్రీడాకారిణుల మధ్య జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్