శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్ర‌శ్న రావ‌ణ్‌పై ఉపా కేసు ఉప‌సంహ‌రించాలి

1 గంట క్రితం

cpi rk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఐ జాతీయ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : యూట్యూబర్‌ ‘ప్ర‌శ్న’ రావ‌ణ్‌పై న‌మోదు చేసిన ఉపా కేసు ఉప‌సంహ‌రించుకోవాల‌ని సిపిఐ జాతీయ కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. శుక్ర‌వారం నాడిక్క‌డ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రావణ్‌కి నాలుగు సార్లు బెయిల్ వచ్చిన తరువాత ఉపా చట్టం కింద కేసులు పెట్టారని, ప్ర‌భుత్వం దార‌ణంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఉప చట్టం రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే ఆ చట్టం కింద కేసులు పెడుతున్నారా? అని ప్ర‌శ్నించారు. అయితే రావణ్ వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయికి తగినవిధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అయోధ్య విరాళాల చోరీ దోషులను కేంద్ర, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు కాపాడుతున్నాయని విమ‌ర్శించారు. అయోధ్య విరాళాల చోరీ కేసును సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ప్రధాని మోడీ మాట్లాడటం లేదని, మౌనంగా ఉండ‌టం దేనికి సంకేతమ‌ని ప్రశ్నించారు. 12 ఏళ్లలో ప్ర‌ధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్