- నేడు న్యూజిలాండ్‌తో ఐదో, చివరి వన్డే
- ఉదయం 7.30గం.ల నుంచి
మౌంట్‌మొఘనాయ్: న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ ఖాయం అనుకున్న దశలో న్యూజిలాండ్ అద్భుతంగా పుంజుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచి 2-0 ఆధిక్యతలో ఉన్న టీమిండియా.. మూడో వన్డే వర్షార్పణం కావడం, నాల్గో వన్డేలో టీమిండియా చిత్తు ఓడడంతో ఐదో, చివరి వన్డే ప్రాధాన్యత సంతరించుకుంది. మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా ఆదివారం ఐదో వన్డే జరగనుంది. ప్రస్తుతం భారత్ 2-1తో సిరీస్ ఆధిక్యతలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకుంటుంది. న్యూజిలాండ్ విజయం సాధిస్తే సిరీస్ 2-2తో సమమవుతుంది. అయితే నాలుగో వన్డేలో భారత బ్యాటర్లు ఎదుర్కొన్న ఘోర వైఫల్యం ఇప్పుడు జట్టుకు పెద్ద ఆందోళనగా మారింది. ఇదే పిచ్‌పై జరిగిన నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 333 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 26.4 ఓవర్లలో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 244 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ కొత్త బంతితో చెలరేగడంతో పరుగుల ఖాతా తెరవకుండానే 3 వికెట్లు, పవర్‌ప్లే ముగిసేలోపే భారత్ 9 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు గత ఏడేళ్లుగా సొంతగడ్డపై వన్డే సిరీస్ కోల్పోలేదు. ఈ రికార్డును కొనసాగించాలని కివీస్ భావిస్తోంది.
జట్లు(అంచనా): ఇండియా: శ్రేయస్(కెప్టెన్), రోహిత్, గైక్వాడ్, కోహ్లి, ఇషాన్(వికెట్ కీపర్), అక్షర్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, కుల్దీప్/యశ్ ఠాకూర్, సిరాజ్, ఆర్ష్‌దీప్. న్యూజిలాండ్: సాంట్నర్(కెప్టెన్), షెఫర్ట్(వికెట్ కీపర్), యంగ్, కెల్లె, ఫాక్స్‌క్రాఫ్, అలెన్, బ్రాస్‌వెల్, క్రిస్టియన్, టిక్నెర్, డఫీ, ఫిషెర్.







కామెంట్‌లు (0)