తెలంగాణ : కేంద్ర విదేశాంగశాఖ అనుమతినివ్వకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. యుఎస్ పర్యటనకు కేంద్రం అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. తన పర్యటనకు రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించారని అన్నారు. రాజకీయ కోణంలో పర్యటనను అడ్డుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయటమే తన లక్ష్యం అని చెప్పారు. తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలు తీసుకురావడమే తన లక్ష్యం అన్నారు. ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావటమే పర్యటన ఏకైక ఉద్దేశం అని చెప్పారు. తన విదేశీ పర్యటన వికసిత్ భారత్‌కు దోహదపడుతుందని భావించానన్నారు. దేశ నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని నమ్ముతానని సిఎం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు.. అమెరికా పర్యటన కొనసాగించాలని అధికారుల బృందానికి సిఎం ఆదేశించారు. అన్ని ఎంవోయూలు యథాతథంగా చేసుకోవాలని, వర్సిటీలతో భాగస్వామ్య ఒప్పందాలను ఖరారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన ముఖ్యమంత్రి .. అక్కడి నుంచి నేరుగా లండన్ కు చేరుకున్నారు. శుక్రవారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్‌బాల్ ప్రజంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను, సాయంత్రం లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శిస్తారు. ఆగస్టు 23న సీఎం లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు బయలుదేరతారు.
కేంద్రం అనుమతి నిరాకరణ - సిఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 11:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)