ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున ఆస్పతికి తరలించినట్లు ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అడియాలా జైలు నుండి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించారని పిటిఐ జర్నలిస్టులకు పంపిన సందేశంలో పేర్కొంది. మూడేళ్లకు పైగా జైలులో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యం క్షీణించిందని ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జైలులో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కుడి కంటి చూపు గణనీయంగా తగ్గిందని ఆయన న్యాయవాదులు చెబుతున్నారు. అయితే, తక్షణ చికిత్స అవసరమయ్యే అనారోగ్య సమస్యలేవీ వైద్య నివేదికల్లో వెల్లడి కాలేదని ప్రభుత్వం తెలిపింది. ఖాన్‌ను 48 గంటల్లోగా రాజధాని నగరంలోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించాలని, అలాగే ఆయన వ్యక్తిగత వైద్యుడు కూడా సభ్యుడిగా ఉన్న వైద్య బృందం ద్వారా చికిత్స పొందేందుకు అనుమతించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్పత్రికి తరలింపు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 21, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)