తెలంగాణ : రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ వేదికగా సోమవారం ‘మహా వరుణ యాగం’ నిర్వహించింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విశేష యాగంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూర్ణాహుతి విశేష హోమాల మధ్య సిఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నామని సిఎం దంపతులు తెలిపారు. ఈ వేడుకల్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో యాత్రికులు, ప్రజలు హాజరయ్యారు.
వరుణయాగంలో సిఎం రేవంత్ రెడ్డి దంపతులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 05:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)