హైదరాబాద్ : అవసరమైతే తప్ప బయటకు రావద్దని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గురువారం ఐటి ఉద్యోగులను హెచ్చరించారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని సూచించారు. నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చూసేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సంస్థలు తమ కార్యాలయ స్థానం, ముందస్తు లాగౌట్ సమయాలను ట్రాఫిక్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించారు. వర్షం పడుతున్నప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 30, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)