తెలంగాణ : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి లేజర్ లైట్లు కలకలం రేపాయి. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానం హైదరాబాద్‌కు చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమైంది. అయితే, అదే సమయంలో లేజర్ లైట్లు విమానం కాక్‌పిట్ వైపు ప్రసరించాయి. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. లేజర్ కాంతులు పైలట్ల దృష్టిని తాత్కాలికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ల్యాండింగ్ సమయంలో ఇది అత్యంత ప్రమాదకరం. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. పైలట్ ఫిర్యాదు మేరకు విమానాశ్రయ అధికారులు, భద్రతా విభాగాలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. లేజర్ లైట్లు ఏ ప్రాంతం నుంచి ప్రసరించాయనే అంశంపై సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లేజర్ లైట్ల వినియోగం అత్యంత ప్రమాదకరమని ఏటీసీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో లేజర్ లైట్ల కలకలం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)