ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరికొన్ని జిల్లాలకు ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ తినదగిన నూనెల మిషన్–ఆయిల్ పామ్ కింద 12 జిల్లాల్లోని 63 మండలాల్లో మొత్తం 12,391 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తిరుపతి, కర్నూలు, అనంతపురం, బాపట్ల, వైఎస్‌ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, ఏలూరు, శ్రీకాకుళం, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టనున్నారు. జిల్లాల వారీ పరిశీలిస్తే.. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 3,850 హెక్టార్లు, కడప 2,050, కర్నూలు 2,301, మార్కాపురం 1,660, కృష్ణా జిల్లాలో 850 హెక్టార్లు చొప్పున విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగుకు అవకాశాలను గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ ఆయా ప్రాంతాల అనుకూలతను బట్టి సాగు విస్తీర్ణాన్ని కేటాయించారు.
Print Edition12,391 హెక్టార్లలో ఆయిల్ పామ్ విస్తరణ
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)